BC SC ST JAC logoబీసీ • ఎస్సీ • ఎస్టీ జేఏసీ
హోమ్ / నాయకులు
ఛైర్మన్ · BC, SC, ST JAC

డా. విశారదన్ మహారాజ్

Dr. Visharadan Maharaj · Chairman, BC, SC, ST – Rights & Rajyadhikara Sadhana JAC

డా. విశారదన్ మహారాజ్
చైర్మన్ సందేశం · Chairman's message

ప్రియమైన తెలంగాణ ప్రజలారా..!Dear people of Telangana

ప్రియమైన తెలంగాణ ప్రజలారా...

తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఉద్యమ పుట్టుకే ఒక సామాజిక విప్లవం, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యం..!

బుద్ధుడు, అశోకుడు, సంత్ రవిదాస్, సంత్ కబీర్ దాస్, శివాజీ మహారాజ్, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సాహూ మహారాజ్, డా. అంబేడ్కర్, కాన్షీరామ్‌ల ఆశయ దీపాన్ని, వారి ఆలోచనల రథాన్ని తెలంగాణలో వెలిగించడానికి, ముందుకు నడిపించడానికి జన్మించిందే బీసీ, ఎస్సీ, ఎస్టీ - జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అని పునరుద్ఘాటిస్తున్నాం.

మన ప్రాంతంలో సమ్మక్క సారలమ్మల, సర్వాయి పాపన్న గౌడ్‌ల, పండుగ సాయన్నల, కొండా లక్ష్మణ్ బాపూజీల ఆత్మగౌరవ జెండాని, వారి రాజ్యాధికార అజెండాని తెలంగాణలో పునర్నిర్మించడానికే బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ పుట్టిందని మరొక్కమారు సగర్వంగా చాటుతున్నాం.

తెలంగాణ పౌరుషం, తెలంగాణ కోపం, తెలంగాణ ప్రేమ, తెలంగాణ కత్తి పదును అన్నీ దారి తప్పాయి. ఆనాటి రైతాంగ సాయుధ పోరాటం నుండి కమ్యూనిస్టు, నక్సలైట్ ఉద్యమం, మొన్నటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు మన బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపశువులయ్యారు. తద్వారా మన ప్రజలు "ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాంల సామాజిక - న్యాయ - రాజ్యాధికార" పయనం, పని విధానంలోకి నడవలేదు. ఇంత పెద్ద అగాధంలోకి మన అణగారిన 90% ప్రజలు నెట్టివేయబడ్డారు.

4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలను బయటకు తీసి నడిపించడానికై గత సంవత్సరం.. 2025 మార్చి 31న బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భావం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఒక సంవత్సరం 3 నెలలుగా తెలంగాణ అంతటా "సామాజిక న్యాయం - రాజ్యాధికార చైతన్యం, ప్రజా పోరాటాలు" ఈ మూడింటితో రాష్ట్రమంతటా ఒక సంచలనం, అద్భుతమైన రాజ్యాధికార చైతన్యం, భూమి కోసం యుద్ధం. ఇంకా "మా భూమి రథయాత్ర" చైతన్య జ్వాల అగ్ని... ఒక్కటేమిటి ఈ మొత్తం గడిచిన సంవత్సరం అంతా భారీ ఉద్యమం నడిచింది.

ఇంత పెద్ద విజయాలను స్మరించుకుంటూ, భవిష్యత్తులో సాధించాల్సిన, నిర్మించాల్సిన పథాలను మాట్లాడుకోవడానికి ఈ 28/06/2026 వార్షిక సదస్సుని నిర్వహిస్తున్నాం, రండి.

నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జేఏసీని స్థాపించి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు...! ఇప్పుడు.. అదే తెలంగాణలో మన 90% బీసీ ఎస్సీ ఎస్టీ బలగమంతా జేఏసీగా ఒక్కటై తెలంగాణలో మన రాజ్యాన్ని...

డా. విశారదన్ మహారాజ్చైర్మన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ
ఒక్క చూపులో · At a glance

ఏడాది ఉద్యమంA year of the movement

31.03.2025జేఏసీ ఆవిర్భావం · JAC founded
1 లక్ష కి.మీ.మా భూమి రథయాత్ర · Maa Bhoomi Rathayatra (1 lakh km)
4 కోట్లుబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు · BC, SC, ST people (4 crore)
90%తెలంగాణ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా · Share of BC, SC, ST in Telangana's population
28.06.2026మొదటి వార్షిక సదస్సు · First anniversary conference
డా. విశారదన్ మహారాజ్ 1 లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర
ఆవిర్భావం · Founding

జేఏసీ ఆవిర్భావంHow the JAC began, 31.03.2025

తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో 31.03.2025న "బీసీ, ఎస్సీ, ఎస్టీ - రైట్స్ & రాజ్యాధికార సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)" నూతన వేదిక ఆవిర్భవించింది.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, పాలమూరు విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు గారు, ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ విఠల్ గారు, దాసోజు లలిత గారు, వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు.

బహుజన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన, రాజకీయ ప్రాతినిధ్య విస్తరణ, రాజ్యాధికార సాధన కోసం నిరంతరం పోరాడే ప్రజా వేదికగా ఈ జేఏసీ పనిచేస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బహుజన సమాజానికి రాజకీయ అధికారం దక్కే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు ప్రకటించారు.

ఈ ఆవిర్భావ సభలో డా. విశారదన్ మహారాజ్ గారిని జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా, రాఘవేంద్ర ముదిరాజ్, రాసాల వినోద్ యాదవ్‌లను కో-కన్వీనర్లుగా సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.

పోరాటాలు, విజయాలు · Timeline

ఏడాదిలో సామాజిక పోరాటాలు, విజయాలుStruggles and victories of the first year

  1. జేఏసీ ఆవిర్భావం

    JAC launched

    డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భవించింది; ఆయన రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.

  2. మా భూమి రథయాత్ర ప్రారంభం

    Maa Bhoomi Rathayatra begins in Adilabad

    అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ సభతో "ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర" ప్రారంభమైంది; ఇది 11.07.2028 వరకు కొనసాగనుంది.

  3. గిమ్మ గ్రామంలో వసతి గృహ సందర్శన

    Hostel visit and clean-up at Gimma

    జైనథ్ మండలం గిమ్మలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి, స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

  4. ఎస్సీ వసతి గృహంలో తాగునీటి డిమాండ్

    Demand for safe drinking water at SC hostel

    ఆదిలాబాద్ ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

  5. కొమురం భీం గ్రామంలో ఆదివాసీ సభ

    Adivasi meeting at Komuram Bheem village

    మావల మండలం కొమురం భీం గ్రామంలో ఆదివాసీ మహాసభలో పాల్గొని ఆదివాసీ సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చారు.

  6. రైతు కుటుంబాలకు పరామర్శ

    Consoling farmer families

    తలమడుగు మండలం సుంకిడిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి, గిట్టుబాటు ధరలు, రుణ విముక్తి డిమాండ్ చేశారు.

  7. వరంగల్‌లో తొలి ఆవిర్భావ సదస్సు

    First JAC district conference, Warangal

    వరంగల్‌లో తొలి బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భావ సదస్సులో జేఏసీ లక్ష్యాలను వివరించారు.

  8. ఇచ్చోడలో కార్మికులతో

    With workers in Ichoda

    ఇచ్చోడలో కార్మికులతో కలిసి బస్తాలు మోసి వారి కష్టాలు తెలుసుకున్నారు; పీహెచ్‌సీలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు.

  9. బీసీ, ఎస్సీ, ఎస్టీ అమరవీరుల స్తూపం

    Martyrs' memorial programme

    "ఇదీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అమరవీరుల స్తూపం" నినాదంతో అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

  10. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం

    Dignity of labour for sanitation workers

    బోథ్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి, "శ్రమకు గౌరవం" సందేశమిచ్చి, వారికి భద్రతా పరికరాలు, ఆరోగ్య బీమా డిమాండ్ చేశారు.

  11. ఆదిలాబాద్ ఆవిర్భావ సదస్సు

    Adilabad JAC conference

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆవిర్భావ సదస్సు ఘనంగా జరిగింది.

  12. "బడిబాట కోసం - బస్సు కావాలి" ధర్నా

    'Bus for school' protest

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం ఆదిలాబాద్‌లో ధర్నా; రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపు.

  13. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ప్రజాధర్నా

    Mass dharna at Adilabad Collectorate

    మూడు నెలల రథయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యలపై వినతిపత్రాలతో కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా.

  14. నల్గొండ ఆవిర్భావ సదస్సు

    Nalgonda JAC conference

    నల్గొండలో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భావ సదస్సు జరిగింది.

  15. అంబేద్కర్ విగ్రహావిష్కరణ

    Ambedkar statue unveiling

    యాదాద్రి భువనగిరి జిల్లా కంకణాలగూడెంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  16. వనపర్తి ఆవిర్భావ సదస్సు

    Wanaparthy JAC conference

    వనపర్తి (ఉమ్మడి మహబూబ్‌నగర్)లో జేఏసీ ఆవిర్భావ సదస్సు జరిగింది.

  17. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా

    Maha dharna for 42% BC reservation

    బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నాలో ప్రసంగించారు.

  18. కామారెడ్డి బీసీ ఆక్రోశ సభ

    BC Aakrosha Sabha, Kamareddy

    కామారెడ్డిలో "బీసీ ఆక్రోశ సభ" వేలాది మందితో ఘనంగా జరిగింది.

  19. బీసీ బంద్‌కు మద్దతు

    Support for BC bandh

    42% రిజర్వేషన్ల కోసం జరిగిన బీసీ బంద్‌కు జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఎల్బీ నగర్‌లో ధర్నా నిర్వహించింది.

  20. కర్ల రాజేష్ మృతిపై న్యాయపోరాటం

    Justice struggle for Karla Rajesh

    కోదాడలో పోలీసు చిత్రహింసల ఆరోపణలతో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి అండగా రాత్రంతా పోరాటం చేశారు.

  21. పాలమూరు విశ్వవిద్యాలయ సదస్సు

    Social justice seminar, Palamuru University

    "బీసీలకు 42% రిజర్వేషన్లు - సామాజిక న్యాయ సదస్సు"లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

  22. ఢిల్లీలో రిజర్వేషన్ సదస్సు

    Reservation conference in New Delhi

    న్యూఢిల్లీ రాజా రామమోహన్ రాయ్ హాల్‌లో జరిగిన రిజర్వేషన్ సదస్సులో పాల్గొన్నారు.

  23. రాష్ట్ర స్థాయి సమావేశం - చైర్మన్‌గా ఎన్నిక

    Elected JAC State Chairman; logo launched

    సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డా. విశారదన్ మహారాజ్ గారు జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా, రాఘవేంద్ర ముదిరాజ్ అధ్యక్షుడిగా, రాసాల వినోద్ యాదవ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు; జేఏసీ లోగో, కండువా ఆవిష్కరించారు.

  24. రథయాత్ర పునఃప్రారంభం

    Rathayatra resumes

    లక్ష కిలోమీటర్ల "మా భూమి" రథయాత్ర జగిత్యాల జిల్లాలో తిరిగి ప్రారంభమైంది.

  25. పాఠశాలకు తాగునీటి కోసం నిరసన

    Protest wins safe water for school

    బుగ్గారం జడ్పీ ఉన్నత పాఠశాలలో బోరు నీరు తాగుతున్న విద్యార్థుల కోసం నిరసన; ఆర్‌ఓ ప్లాంట్, మినరల్ వాటర్ సరఫరాకు అధికారులు లిఖిత హామీ ఇచ్చారు.

  26. డా. లావణ్య కుటుంబానికి సహాయం

    Relief secured for Dr. Lavanya's family

    ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసి డా. లావణ్య కుటుంబానికి రూ. 4.50 లక్షల తక్షణ సహాయం మంజూరు చేయించారు.

  27. రాజ్యాంగ రథయాత్ర, సభ్యత్వ నమోదు

    Constitution yatra; membership drive

    ఖమ్మంలో రాజ్యాంగ రథయాత్రలో పాల్గొని, జేఏసీ సభ్యత్వ నమోదును అధికారికంగా ప్రారంభించారు.

  28. కుమ్మెర బాధితులకు అండగా

    Standing with Kummera victims

    నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో దాడికి గురైన రజక కుటుంబానికి అండగా ఆసుపత్రి వద్ద సుమారు ఆరు గంటల ధర్నా చేశారు.

  29. బాధితులతో డీజీపీకి వినతి

    Petition to DGP with victims

    భద్రత కోసం కుమ్మెర బాధితులను హైదరాబాద్ తీసుకువచ్చి, వారితో కలిసి రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.

  30. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

    Complaint to Human Rights Commission

    కుమ్మెర బాధితులతో హెచ్‌ఆర్‌సీని కలవగా, సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ డీజీపీని ఆదేశించింది.

  31. ఖమ్మం భూదాన్ బాధితుల మహాధర్నా

    Khammam Bhoodan maha dharna

    వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 700కు పైగా కుటుంబాల కోసం ఖమ్మంలో భారీ ధర్నా, నిరాహార దీక్ష.

  32. పోలీసుల అదుపులోకి

    Detained by police, later released

    తెల్లవారుజామున పోలీసులు డా. విశారదన్ మహారాజ్ గారిని అదుపులోకి తీసుకోగా, రాష్ట్రవ్యాప్త నిరసనల తర్వాత విడుదల చేశారు.

  33. కుమ్మెర బాధితులకు 2BHK, ఉద్యోగం

    2BHK house and job for Kummera family

    పోరాట ఫలితంగా బాధిత కుటుంబానికి 2BHK ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు అందాయి; వెలుగుమట్లపై నిజనిర్ధారణ కమిటీ మీడియా సమావేశం.

  34. పరిగి భూ బాధితుల ధర్నా

    Land victims' protest, Parigi

    కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల భూ బాధితుల కోసం ధర్నా; అరెస్టు తర్వాత ఉద్యమ ఫలితంగా బాధితులకు న్యాయం జరిగింది.

  35. "ఎవరి కులం ఎంతో వారికంత వాటా" సభలు

    Proportional-share public rallies begin

    నిజామాబాద్‌లో "ఎవరి కులం ఎంతో - వారికంత వాటా" నినాదంతో తొలి భారీ బహిరంగ సభ జరిగింది.

  36. గవర్నర్‌కు వినతిపత్రం

    Petition to the Governor

    వెలుగుమట్ల, కాడ్లాపూర్, రాపోల్, రీజినల్ రింగ్ రోడ్ భూ బాధితులతో కలిసి గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని కలిశారు.

  37. మహబూబ్‌నగర్ బహిరంగ సభ

    Mahabubnagar public meeting

    మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ విజయవంతంగా జరిగింది.

  38. మొదటి వార్షిక సదస్సు

    First anniversary conference

    జేఏసీ మొదటి వార్షికోత్సవ సదస్సు - విజయాల స్మరణ, భవిష్యత్ కార్యాచరణ.

ఫోటోలు చూడండి · View photos విరాళం ఇవ్వండి · Donate