BC SC ST JACబీసీ • ఎస్సీ • ఎస్టీ జేఏసీ
జేఏసీ బహిరంగ సభ
Joint Action Committee · Telangana

బీసీ • ఎస్సీ • ఎస్టీ జేఏసీ

తెలంగాణ 90% ప్రజలకు సామాజిక న్యాయం, సమాన వాటా, రాజ్యాధికారం.

మా లక్ష్యం · Our mission

90% ప్రజలు ఒక్కటైతే, అధికారంలో 90% వాటా.

తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో 31.03.2025న "బీసీ, ఎస్సీ, ఎస్టీ - రైట్స్ & రాజ్యాధికార సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)" నూతన వేదిక ఆవిర్భవించింది.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, పాలమూరు విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు గారు, ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ విఠల్ గారు, దాసోజు లలిత గారు, వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు.

బహుజన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన, రాజకీయ ప్రాతినిధ్య విస్తరణ, రాజ్యాధికార సాధన కోసం నిరంతరం పోరాడే ప్రజా వేదికగా ఈ జేఏసీ పనిచేస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బహుజన సమాజానికి రాజకీయ అధికారం దక్కే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు ప్రకటించారు.

సామాజిక న్యాయం · సమాన అవకాశాలు · ఆత్మగౌరవం
31.03.2025జేఏసీ ఆవిర్భావం
1 లక్ష కి.మీ.మా భూమి రథయాత్ర
4 కోట్లుబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు
90%తెలంగాణ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా
ఉద్యమం · The movement

జేఏసీ ఏడాది పోరాటాలు, విజయాలు

  1. జేఏసీ ఆవిర్భావం

    డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భవించింది; ఆయన రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.

  2. మా భూమి రథయాత్ర ప్రారంభం

    అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ సభతో "ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర" ప్రారంభమైంది; ఇది 11.07.2028 వరకు కొనసాగనుంది.

  3. గిమ్మ గ్రామంలో వసతి గృహ సందర్శన

    జైనథ్ మండలం గిమ్మలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి, స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

  4. ఎస్సీ వసతి గృహంలో తాగునీటి డిమాండ్

    ఆదిలాబాద్ ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

  5. కొమురం భీం గ్రామంలో ఆదివాసీ సభ

    మావల మండలం కొమురం భీం గ్రామంలో ఆదివాసీ మహాసభలో పాల్గొని ఆదివాసీ సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చారు.

  6. రైతు కుటుంబాలకు పరామర్శ

    తలమడుగు మండలం సుంకిడిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి, గిట్టుబాటు ధరలు, రుణ విముక్తి డిమాండ్ చేశారు.

  7. వరంగల్‌లో తొలి ఆవిర్భావ సదస్సు

    వరంగల్‌లో తొలి బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆవిర్భావ సదస్సులో జేఏసీ లక్ష్యాలను వివరించారు.

  8. ఇచ్చోడలో కార్మికులతో

    ఇచ్చోడలో కార్మికులతో కలిసి బస్తాలు మోసి వారి కష్టాలు తెలుసుకున్నారు; పీహెచ్‌సీలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు.

  9. బీసీ, ఎస్సీ, ఎస్టీ అమరవీరుల స్తూపం

    "ఇదీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అమరవీరుల స్తూపం" నినాదంతో అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

  10. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం

    బోథ్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి, "శ్రమకు గౌరవం" సందేశమిచ్చి, వారికి భద్రతా పరికరాలు, ఆరోగ్య బీమా డిమాండ్ చేశారు.

సంప్రదించండి · Contact us

రాష్ట్ర కార్యాలయం

చిరునామా · Address

State Office
Plot 6, HIG 2, Block 6,
Beside Sundarayya Park, Bagh Lingampally,
Hyderabad, Telangana – 500044

మ్యాప్‌లో చూడండి · Map

సమస్యలు / సమాచారం · Issues & info

WhatsApp95029 59998

ఫోన్ · Phone96408 9295095029 1122895029 59998

Donate · విరాళం ఇవ్వండి